లక్ష్మీపార్వతి దృష్టిలో వర్మ ఇప్పుడు మేధావి.

Ram Gopal Varma to Direct Lakshmis NTR movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“దారి తప్పిన మేధావి”… ఈ టైటిల్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సరిపోతుందో, లేదో గానీ ఆయన్ని తరచుగా ఇలా పిలిచేది మాత్రం లక్ష్మీపార్వతి. వివాదాలు రాముకి కొత్త కాదు. ఆయన ఎప్పుడు ఏ వివాదం ముందుకు తెచ్చినా దారి తప్పిన మేధావి అంటూ లక్ష్మీపార్వతి ఆయన్ని టార్గెట్ చేస్సేవాళ్ళు. కొన్ని నెలల కిందట ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాగా చేస్తున్నట్టు వర్మ ప్రకటించగానే లక్ష్మీపార్వతి ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. డబ్బు కోసం ఏమైనా చేసే వర్మ కి ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా చేసే అర్హత లేదని తేల్చేశారు. బాబు చెప్పినట్టు బాలయ్య , బాలయ్య చెప్పినట్టు వర్మ ఆ సినిమా తీసే అవకాశం ఉందని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాని వర్మ చేతుల్లో పెట్టేందుకు బాలయ్య వెనకాడడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. స్క్రిప్ట్ మొత్తం మారిపోయింది.

బాలయ్య హీరోగా వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్ర చేద్దాం అనుకున్నప్పుడు ఆయన సినీ జీవితం దగ్గర మొదలయ్యే సినిమా ముఖ్యమంత్రి అవ్వడంతో ముగించాలని అనుకున్నారు. చిత్ర సీమతో పాటు, రాజకీయాల్లోకి అడుగు పెట్టే సమయంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాల మీదే ప్రధానంగా దృష్టి సారించారు. అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా కోసం బాలయ్య కొత్త దర్శకుడిని వెదుకుతున్నట్టు తెలియగానే వర్మ హర్ట్ అయ్యాడు. దర్శకుడు తేజ తో బాలయ్య ఈ విషయం మీద మాట్లాడినట్టు తెలియగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటన కూడా ఇచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశం, 1994 ఆగష్టు సంక్షోభం, చంద్రబాబు సీఎం కావడం వెనుకున్న రహస్యాలఫై స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈపాటికే వర్మ మనుషులు లక్ష్మీపార్వతిని కలిసి ఆమె దగ్గర లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి అవసరమైన విషయాలు సేకరించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈసారి కూడా ఆమె ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడారు. అయితే తన వెర్షన్ తీసుకున్నందుకు కాబోలు వర్మ ని పిలిచేటప్పుడు దారి తప్పిన మేధావి అన్న మాట తీసేసారు. ఔను తనకు కావాల్సింది చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వర్మ ఆమెకి మేధావిగా కనిపిస్తున్నాడేమో.