స్పెష‌ల్ ప‌ర్స‌న్‌కి తొలి పోస్ట్ డెడికేట్ చేసిన రామ్ చ‌ర‌ణ్

ram charan dedicated his first post to special person

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాకి కాస్త దూర‌మనే చెప్ప‌వ‌చ్చు. కీల‌క స‌మ‌యాల‌లో మాత్ర‌మే త‌న ఫేస్ బుక్ ద్వారా స్పందించే రామ్ చ‌ర‌ణ్ జూలై 8న‌ ఇన్‌స్టాగ్రామ్‌లోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా త‌న తొలి పోస్ట్‌గా ‘రంగస్థలం’ సినిమాలోని చిట్టిబాబు లుక్‌ను షేర్ చేస్తూ దానినే ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంచారు. ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంపై అభిమానులే కాదు ప‌లువురు ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, అఖిల్ అక్కినేని, అల్లు అర్జున్ త‌దిత‌రులు ఆయ‌న‌కి స్వాగ‌తం ప‌లికారు .అయితే always ram charan పేరుతో త‌న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఓపెన్ చేసిన రామ్ చ‌ర‌ణ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ముందుగా రంగ‌స్థ‌లంలోని పిక్‌ని పెట్టాడు . ఇప్పుడు దానిని తొల‌గించి తొలి పోస్ట్‌గా తన తల్లితో చిన్నప్పుడు దిగిన రెండు ఫొటోలను మిక్స్ చేసి… అప్‌లోడ్ చేశాడు. దానికి కామెంట్‌గా నా తొలి పోస్ట్‌ని అమ్మ‌కి అంకితం చేస్తున్నాను. ల‌వ్ యూ అమ్మ అనే కామెంట్ పెట్టాడు. ఇప్పుడీ పోస్ట్‌ను తెగ లైక్ చేస్తున్నారు . ప్ర‌స్తుతం చెర్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 434కె ఫాలోవ‌ర్స్ ఉన్నారు. చెర్రీ ప్ర‌స్తుతం రాజ‌మౌళి క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే