కాస్త లేట్ అయిన లేటెస్ట్‌గా వచ్చిన చెర్రీ

ramcharan enter into social media

ప్ర‌స్తుతం ఈ ప్ర‌పంచం అంతా డిజిట‌ల్ మీడియా చుట్టూనే తిరుగుతుంది. ఏ స‌మాచారం అయిన క్ష‌ణాల‌లో అవ‌త‌లి వారికి చేరుతుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్స్ అయిన ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా ప్ర‌పంచంలో జ‌రిగిన ప్ర‌తి విష‌యం ప్ర‌జ‌ల‌కి ఇట్టే తెలిసిపోతుంది. సినిమా సెల‌బ్రిటీలు ఈ సోష‌ల్ నెట్‌వర్స్‌తో త‌మ సినిమాకి కావ‌ల‌సినంత ప్ర‌చారాన్ని ఈజీగా చేసుకోగ‌లుగుతున్నారు. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు అంద‌రు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌ని వాడుతూ వ‌స్తున్నారు. ఇక టాలీవుడ్‌లోను ఎన్టీఆర్‌, మ‌హేష్‌, ప్ర‌భాస్ వంటి టాప్ సెల‌బ్రిటీలు కూడా ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల‌ని వాడుతూ అభిమానుల‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటూ వ‌స్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాత్రం చాన్నాళ్ళ నుండి కేవ‌లం ఫేస్ బుక్ మాత్ర‌మే వాడుతూ వ‌స్తున్నాడు. అప్పుడ‌ప్పుడు ఆయ‌న పోస్ట్‌ల‌ని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. అయితే చెర్రీ రీసెంట్‌గా మరో సోషల్ ప్లాట్‌ఫాంలోకి అడుగు పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీసెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన చెర్రీ ‘రంగస్థలం’ సినిమాలోని చిట్టిబాబు లుక్‌ను షేర్ చేస్తూ దానినే ప్రొఫైల్ పిక్చర్‌గా ఉంచారు. ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంపై అభిమానులే కాదు ప‌లువురు ప్ర‌ముఖులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ చరణ్‌కు ఫాలోవర్ల సంఖ్య అప్పుడే 50వేలు దాటింది. ప్రస్తుతానికి రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న సెలబ్రిటీల్లో సాయి ధరమ్ తేజ్, అఖిల్ అక్కినేని ఉన్నారు.