రానా ” సోష‌ల్ ” ట్రైల‌ర్ విడుద‌ల‌

rana-daggubati-social-trailer-released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యువ హీరో రానా న‌టిస్తున్న సోష‌ల్ వెబ్ సిరీస్ ట్రైల‌ర్ రిలీజ‌యింది. రానా ట్విట్ట‌ర్ లో ఈ ట్రైల‌ర్‌ను పోస్ట్ చేశారు. యువ‌తపై సోష‌ల్ మీడియా ప్ర‌భావం, సైబ‌ర్ నేరాలు క‌థాంశంగా సోష‌ల్ చిత్రీక‌రించారు. వ‌న్ క్లిక్ టు డెస్ట్రాయ్ యువ‌ర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ ఉన్న సోష‌ల్ వెబ్ సిరీస్ ఈ నెల 8 నుంచి వియూ వెబ్ చాన‌ల్‌లో హిందీ, తెలుగు భాష‌ల్లో ప్ర‌సారం కానుంది. సోష‌ల్ ద్వారా తొలిసారి డిజిటల్ మీడియాకు ప‌రిచ‌మ‌య‌వుతున్న రానా ఇందులో ఓ టెక్ కంపెనీ సీఈవో పాత్ర‌లో న‌టించారు.న‌వీన్ క‌స్తూరియా, ప్రియా బెన‌ర్జీ కీల‌క‌పాత్ర‌లు పోషించారు.

వెబ్ సిరీస్ కు ఇటీవ‌ల తెలుగులో ఆద‌ర‌ణ పెర‌రుగుతుండ‌టం, రానా ఇందులో న‌టిస్తుండ‌టంతో సోష‌ల్ పై విప‌రీత‌మైన క్రేజ్‌నెల‌కొంది. ఇప్ప‌టికే సోష‌ల్ కు కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కుతోంది. ఈ వెబ్ సిరీస్ ఫ‌స్ట్‌లుక్‌ను, ట్రైల‌ర్ ను ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విప‌రీతంగా షేర్ చేస్తున్నారు. శ‌శి సుడిగాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సోష‌ల్ ను వ్యాక‌వుట్ మీడియా, గురు ఫిలింస్ సంయుక్తంగా నిర్మించాయి. సోష‌ల్ స‌క్సెస్ అయితే…డిజిట‌ల్ మీడియాకు తెలుగులో మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

త‌మిళ అర్జున్ రెడ్డి ధనుష్‌?

ప‌వ‌న్ బాబాయ్ కావ‌టం అదృష్టం క‌న్నా ఎక్కువే

రెండో సినిమా హీరో శ‌ర్వానంద్…