రానా…త్రిష విడిపోవడానికి కారణం ఇదేనా…!

Rana Daggubati On His Break Up With Trisha

త్రిష తెలుగు, తమిళంలో నటిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. తెలుగులో దాదాపుగా స్టార్ హీరోస్ సరసన నటించింది. ఆ తరువాత తెలుగులో కొత్త తరం హీరోయిన్స్ వస్తుంటే తమిళనాడుకు మకాం మార్చింది. అక్కడ మంచి మంచి సినిమాలో నటిస్తూ ఇప్పటకి టాప్ హీరోయిన్స్ సరసన చేరింది. రీసెంట్ గా ఆమె నటించిన చిత్రం 96 మూవీ తమిళనాడులో రికార్డ్స్ సృస్తిస్తుంది. త్రిష ఎంత తొందరగా పేరు సంపాదించుకుందో అంతే తొందరగా రూమర్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఆ మద్య ఓ బిజినెస్ మాన్ తో నిశ్చితార్దం చేసుకొన్ని పెళ్లి దాక వచ్చి చివరకు కాన్సల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత చాలాకాలం రానా తో డేటింగ్ చేస్తుందని కూడా సోషల్ మీడియాలో భాగా వార్తలు వచ్చాయి. ఈ విషయాని తాజాగా కరణ్ విత్ కాఫీ షో లో కరణ్ రానా గురుంచి ఓ రెండు ప్రశ్నలు అడిగాడు. మొదటిది త్రిష తో మీరు డేటింగ్ చేశారు కదా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగారు అందుకు రానా మేము చాలా దిప్లమాటిక్ గా స్నేహ పూర్వకంగా మాత్రమే ఉన్నాం కావునా మ్యారేజ్ చేసుకోలేదు. రెండోవ ప్రశ్నగా మ్యారేజ్ ఎందుకు చేసుకోవుని కరణ్ ప్రశ్నకు రానా నా ఫ్రెండ్స్ బన్నీ, చరణ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు చిక్కరు..దొరకరు. అందుకే నేను ఒకే ఒక్క ఫ్రెండ్ తో అడ్జస్ట్ అవ్వుతున్నా అన్నారు. మ్యారేజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఉండరు అందుకే పెళ్లి చేసుకోలేదు అన్నారు.