త‌మిళ అర్జున్ రెడ్డి ధనుష్‌?

Dhunush gets arjun reddy remake rights in tamil

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ లో ప్ర‌భంజ‌నం సృష్టిస్తోన్న అర్జున్‌రెడ్డిని త‌మిళంలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. రీమేక్ హ‌క్కుల కోసం ఎన్నోనిర్మాణ సంస్థ‌లు పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు స్టార్ హీరో ధ‌నుష్ కు చెందిన నిర్మాణ సంస్థ త‌మిళ రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకుంది. అయితే తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ పోషించిన పాత్ర‌లో ధ‌నుష్‌ న‌టిస్తారా లేక ఇత‌ర హీరోల‌కు అవ‌కాశ‌మిస్తారా అన్న‌ది ఇంకా తెలియ‌లేదు. తెలుగులోలానే అర్జున్ రెడ్డి త‌మిళంలోనూ సూప‌ర్ హిట్ట‌వుతుంద‌ని ధ‌నుష్ న‌మ్మ‌కంగా ఉన్నారు. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తున్న అర్జున్ రెడ్డి కి సామాన్య ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అటు సెల‌బ్రిటీల నుంచి కూడా సినిమాకు భారీ ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి రేంజ్ ఈ సినిమా తర్వాత అనూహ్యంగా పెరిగిపోయింది. విజ‌య్ తో త‌దుప‌రి సినిమా తీసేందుకు ప‌లువురు నిర్మాతలు క్యూక‌డుతుండ‌గా, సందీప్ రెడ్డి డైరెక్ష‌న్ లో న‌టించేందుకు హీరోలు పోటీప‌డుతున్నారు. డైరెక్ట‌ర్, హీరోతో పాటు హీరోయిన్‌, సినిమాలో న‌టించిన ఇత‌ర న‌టుల‌కు కూడా అర్జున్ రెడ్డితో మంచి గుర్తింపు ల‌భించింది. ఒక్క సినిమాతో ఇండ‌స్ట్రీలో ఫేట్ ఎలా మారిపోతుందో అన్న‌దానికి అర్జున్ రెడ్డి చిత్ర‌మే మంచి ఉదాహ‌ర‌ణ‌. గ‌తంలో శివ సినిమా తెలుగు సినిమా రూపురేఖ‌ల్ని ఎలా మార్చివేసిందో…ఇప్పుడు అర్జున్‌రెడ్డి ప్ర‌భావం అలా ఉండ‌బోతోంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు:

ప‌వ‌న్ బాబాయ్ కావ‌టం అదృష్టం క‌న్నా ఎక్కువే

రెండో సినిమా హీరో శ‌ర్వానంద్…

కత్తి మహేష్‌పై వింత పుకార్లు.. క్లారిటీ