అందరినీ బయపెడుతున్న రానా కొత్తలుక్

అందరినీ బయపెడుతున్న రానా కొత్తలుక్

సౌత్ నార్త్‌ అన్న తేడాలేకుండా అన్నిభాషల్లో వరుస సినిమాలు చేస్తున్న స్టార్‌వారసుడు దగ్గుపాటిరానా కొత్త లుక్ అభిమానులలో కలవరంరేపింది.నటుడిగా,హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తు బాహుబలిసినిమాతో రానా మంచిపేరు సంపాదించాడు.

అమెరికాలో కిడ్నీమార్పిడి జరిగిందని,తనతల్లి రానాకు కిడ్నీదానం చేశారంటూ ఆరోగ్యం బాగలేదనే వార్తలు ఎక్కువ అయ్యాయి.వీటిపైన స్పందించిన రానా ఆరోగ్యంగా ఉన్నానని,తనపై వచ్చిన వార్తలు అవాస్తవం అని  ఇంకా ఇదోక బోరింగ్‌ టాపిక్‌ అని తేల్చిచెప్పేశారు.

ప్రముఖ బ్యాంకుకు సంబంధించిన మిలీనియాకార్డు గురించి చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం రానా షేర్‌చేసిన ఫొటో మరోసారి దగ్గుపాటిరానా అభిమానులను ఆందోళనలొ పడేసింది.ఈఫొటోపై స్పందించిన అభిమానులు ఇలాఉన్నావేంటి అన్నా,మాకు బలంగా ఉన్న భల్లాలదేవ కావాలి మాకోసం ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ కామెంట్లు చేశారు.