తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాణా

కలలో కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు వారాల క్రితం వరకూ లాక్ డౌన్ అన్న మాటకు సరిగా అర్థం తెలీని పరిస్థితి నుంచి ఇప్పుడు అదెలా ఉంటుందో కూడా దేశ ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే జరిగే లాక్ డౌన్ మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విధిస్తున్నారు. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు మనలాంటి దేశంలో లాక్ డౌన్ కు మించిన ఔషధం లేనట్లే. లాక్ డౌన్ ను విధించిన సమయంలో చాలామంది ఏప్రిల్ 14కు పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేశారు. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ అంత త్వరగా వీడిపోవటం సాధ్యమయ్యేది కాదు. ఎక్కడి దాకానో ఎందుకు కరోనాకు పుట్టిల్లు అయిన వూహాన్ మహానగరంతో దగ్గర దగ్గర 76 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తే కానీ కరోనాను కంట్రోల్ చేయలేకపోయారు. అలాంటిది మన దేశంలోని పరిస్థితులు.. మౌలిక సదుపాయాల్ని పరిగణలోకి తీసుకుంటే.. లాక్ డౌన్ మినహాయింపు అనివార్యమని అర్థం కాక మానదు. రెండో దఫా కూడా ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ ను విధిస్తూ ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యానికి గురి చేయలేదు. కారణం.. ప్రస్తుత పరిస్థితులే. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. లాక్ డౌన్ ఉంటేనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒకసారి ఎత్తేస్తే పరిస్థితులు మరెంత భయానకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా సరే.. మే 3 తర్వాత పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరో మూడు వారాల తర్వాత ఏం జరుగుతున్నది ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని చెప్పేటోళ్లు చాలామందే కనిపిస్తారు. కానీ.. లాజిక్ గా చూస్తే.. మే మూడు తర్వాత పరిస్థితి ఏమిటన్నది ఈ నెల ఇరవై.. ఇరవై ఒకటో తేదీల్లో తేలుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. అప్పటికి కేసుల నమోదు ఒక కొలిక్కి వచ్చి.. ఇప్పుడు నమోదవుతున్న కేసుల్లో 25 శాతానికి తగ్గితే.. లాక్ డౌన్ పొడిగింపునకు అవకాశం ఉంటుంది. అదెలానంటే.. ఏప్రిల్ 20.. 21 తేదీలకు పాజిటివ్ గా తేలిన వారి చికిత్సకు పద్నాలుగు రోజులు పడుతుంది. ఆ రోజుల్లో పాజిటివ్ గా తేలిన వారి కాంటాక్టు గుర్తించటం.. మళ్లీ వారిని ఎవరెవరు కలిశారన్నది లెక్క తేల్చటానికి పట్టే సమయం.. వారిలో రోగ లక్షణాలు ఇవన్నీ చూసుకుంటూ వెళితే.. మే చివరకు పాజిటివ్ ల సంఖ్య తగ్గటమా? పెరగటమా? తేలిపోతుంది. కేసులు పెరుగుతున్న కొద్దీ లాక్ డౌన్ పొడిగింపు అనివార్యమవుతుంది. మరి.. దీనికి అంతం ఎప్పుడంటే.. జాతిజనుల చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే ఎవరికి వారు లాక్ డౌన్ ను తూచా తప్పకుండా పాటిస్తే తప్పించి పరిస్థితి అదుపులోకి రాదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటే మాత్రం.. మే మూడు తర్వాత కూడా పొడిగింపు తప్పదు.

దగ్గుబాటి వారసుడిగా టాలీవుడ్ లోకి ‘లీడర్’ సినిమాతో పరిచయమయ్యాడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుండి కేవలం కథా బలమున్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకవైపు హీరోగాను మరోవైపు విలన్ గా నటిస్తూ సత్తా చాటుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాతో భళ్లాలదేవుడుగా రానా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత నుంచి రానా ఎప్పుటికప్పుడు విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తెలుగు తమిళ హిందీ భాషల్లో ‘అరణ్య‘ అనే పాన్ ఇండియా రూపొందిస్తున్నారు. ప్రభు సాలోమన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం తెలుగులో ‘అరణ్య’.. తమిళంలో ‘కాదన్’.. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. మానవులు – జంతువులను ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో కరోనా వచ్చి మనోడి మీద దెబ్బేసింది.

వివరాల్లోకి వెళ్తే ఎంతో కష్టపడి.. ఎంతో ఖర్చు పెట్టి ‘అరణ్య’ సినిమా తీస్తే కరోనా మహమ్మారి దెబ్బకి ఈ సినిమాకి ఇప్పుడప్పుడే సోలో రిలీజ్ డేట్ దొరికే అవకాశం కనిపించడం లేదంట. ‘ఘాజీ’ సినిమా మాదిరిగా పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టేద్దాం అనుకున్న రానాకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రొడక్షన్ లో పెట్టిన పెట్టుబడి చాలా వరకు రానా ఎకౌంట్ నుంచే ట్రాన్సఫర్ అయినట్లుగా సమాచారం. దీనికి ఇప్పుడు వడ్డీతో కలిపి రాబట్టాలంటే ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా బ్రేక్ ఈవెన్ కావాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు. లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లు మళ్లీ తెరుచుకున్నా ఆల్రేడీ క్యూలో ఉన్న సినిమాలతో.. ఈ గ్యాప్ ని సంపూర్తిగా వాడుకొని రిలీజ్ కి రెడీ అయిన సినిమాలతో.. ‘అరణ్య’ పోటీ పడటం చాలా కష్టమైన విషయమే. అంతే కాకుండా మాస్ సెంటర్స్ లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ డీగ్లామర్ సినిమాకి ఉన్న మెయిన్ ఎట్రాక్షన్ అడివిలో రానా చేసే సాహసాలే అట. మరి రానా చేసే సాహసాలు థియేటర్ కు జనాల్ని ఎంతవరకు తీసుకురాగలుగుందో.. ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో అనేది చూడాలి. ఏదేమైనా రానాకి ఇది కచ్ఛితంగా బ్యాడ్ టైమ్ అనే చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా రానా ‘అరణ్య’ చిత్రం అనంతరం వేణు ఉడుగుల దర్శకత్వం లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘విరాట పర్వం’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నది.