మాకు ఎలాంటి టెన్షన్స్‌ లేవు

Rana says about his Father Suresh babu after Abhiram Issue

గత కొన్ని రోజులుగా నిర్మాత సురేష్‌బాబు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, ఇద్దరు కొడుకుల వల్ల ఆయన మనోవేదనకు గురి అవుతున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ వార్తలు నిజం కాదని, తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని, తన తండ్రికి ఎలాంటి మనో వేధన, మానసిక వేదన లేదు అంటూ రానా చెప్పకనే చెప్పాడు. తాజాగా రానా పోస్ట్‌ చేసిన ఒక ఫొటో గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. సురేష్‌బాబు చిన్న కొడుకు అభయ్‌ రామ్‌ చేసిన పనులు, ఆయనపై శ్రీరెడ్డి చేసిన విమర్శలు తీవ్ర స్థాయిలో దుమారంను రేపాయి. మరో వైపు రానా కంటి సమస్య కూడా సురేష్‌బాబుకు మనస్సును నొప్పించే విధంగా తయారు అయ్యిందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలపై కూడా ఎక్కువ దృష్టి పెట్టలేక పోతున్నాడు అంటూ కొందరు ప్రచారం చేశారు.

మీడియాలో వచ్చిన వార్తలకు రానా ఫొటో సమాధానంగా నిలిచింది. సురేష్‌బాబు ఎలాంటి టెన్షన్‌ లేకుండా హాయిగా ఉన్నాడని, ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంను విడుదల చేసేందుకు సన్నాహకాల్లో ఉన్నాడు. అంతా కొత్త వారితో తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఆ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సురేష్‌బాబు తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మరో వైపు పలు సినిమాలను సురేస్‌ ఫిల్మ్స్‌ ద్వారా డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న సురేష్‌బాబు మనోవేదనకు గురవుతున్నాడు అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేలిపోయింది. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ రానా చేసిన ట్వీట్‌ అందరిలో కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చింది.