‘ఎన్టీఆర్‌’లో రానా కూడా ?

Rana to acts in NTR Biopic movie As Chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను బాలయ్య పోషించబోతున్నాడు. దాదాపు 70 గెటప్స్‌లో బాలయ్య కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించబోతున్నది ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషించనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాత్రను కూడా ప్రముఖ నటుడితో చేయించాలని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. సినిమా రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతుంది. రెండవ పార్ట్‌లో చంద్రబాబు నాయుడు పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం అందుతుంది.

మొదట నారా చంద్రబాబు నాయుడు పాత్రకు యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ను ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు మరియు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో వయస్సు తక్కువే. అందుకే రాజశేఖర్‌ను కాకుండా చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి బాలయ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిత్రంలో రానాను నటించాల్సిందిగా తేజ ఇటీవల కలిసి కోరినట్లుగా తెలుస్తోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తనకు మంచి సక్సెస్‌ను ఇచ్చిన విశ్వాసంతో రానా వెంటనే ఒప్పేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.