రంగ రంగ రంగస్థలాన.. రివ్యూ

Ranga Ranga Rangasthalaana Song Review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు ‘రంగస్థలం’ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు నిర్మాతు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయిన ‘రంగస్థలం’ నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మరో వైపు ఈ సినిమా రెండవ పాటను తాజాగా విడుదల చేయడం జరిగింది. మొదటి పాట ఎంత సక్కంగున్నావే..కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఆ పాటను శ్రీదేవికి చిత్ర యూనిట్‌ సభ్యులు అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. తాజాగా చిత్ర టైటిల్‌ సాంగ్‌ రంగ రంగ రంగస్థలానా.. అనే పాటను విడుదల చేశారు.

మొదటి పాటతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవిశ్రీ ప్రసాద్‌ ఈసారి మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాడు. ఇక చంద్రబోస్‌ మంచి అర్థంతో లిరిక్స్‌ను అందించాడు. జీవితం అనే రంగస్థలంలో అందరం కూడా ఆటబొమ్మలమే అనే అర్థం వచ్చేలా చంద్రబోస్‌ రాసిన పాట ఆలోచనాత్మకంగా ఉంది. రాహుల్‌ పాటకు ప్రాణం పోశాడు. తన గాత్రంతో చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌కు మ్యాచ్‌ చేశాడు. మొత్తంగా టైటిల్‌ సాంగ్‌ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది. తప్పకుండా సినిమాలో ఈ పాట మరింత హైలైట్‌గా ఉంటుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటలో సమంత కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. చరణ్‌, సమంతల డాన్స్‌తో ఈ పాట స్థాయి మరింతగా పెరగడం ఖాయం. మార్చి 30న విడుదల కాబోతున్న ఈ చిత్రం మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. 1980 నేపథ్యం అంటే ఖచ్చితంగా ప్రయోగం అని చెప్పాలి. మరి సుకుమార్‌ చేసిన ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు చూడాల్సిందే.