‘హౌరా బ్రిడ్జ్‌’లో మంచి ఎంటర్‌టైన్‌ చేశాను : రావు రమేష్‌

Rao Ramesh Says Howrah Bridge

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో తెరకెక్కిన ‘హౌరా బ్రిడ్జ్‌’ చిత్రంలో రావు రమేష్‌ కీలక పాత్ర పోషించారు. నటుడిగా తన తండ్రి రావుగోపాల్‌ రావును గుర్తు చేస్తున్న రావు రమేష్‌ ఈ చిత్రంకు ప్రధాన ఆకర్షణగా ఉంటాడని చిత్ర యూనిట్‌ సభ్యులు మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. తాజాగా ‘హౌరా బ్రిడ్జ్‌’లోని తన పాత్ర గురించి రావు రమేష్‌ మీడియాతో మాట్లాడటం జరిగింది. రావు రమేష్‌ మాటలు సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. 

రావు రమేష్‌ ‘హౌరా బ్రిడ్జ్‌’ గురించి మాట్లాడుతూ… దర్శకుడు యాదు గారితో మొదటి సారి చేయడం జరిగింది. ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేశాను అని చెప్పే కంటే, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే పాత్ర చేశాను అని చెప్పుకోవచ్చు. సినిమాకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది చాలా ముఖ్యం. అందుకే తన పాత్ర ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే విధంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ పాత్ర అందిస్తుంది. దర్శకుడు యాదు నా పాత్రను చాలా ఎంటర్‌టైనింగ్‌గా డిజైన్‌ చేశారు. ఇక సినిమాలో నటించిన నటీనటులు మరియు టెక్నీషియన్స్‌ అంతా కూడా బాగా కుదిరారు. అంతా కష్టపడి ఈ చిత్రాన్ని చక్కగా చేశాం. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని చౌదరిల కాంబోలో వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు.