రాశిఖన్నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఆఫర్‌

Rashi Khanna in Rajamouli Multistarrer movie
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈ సంవత్సరం మొదటి కమర్షియల్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నాకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి ఈమె నటించిన ‘తొలిప్రేమ’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో ఈమె నటనకు సినీ వర్గాల వారు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈమె నటన టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళిని కట్టి పడేసినట్లుంది. అందుకే తాను తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో ఈమెకు ఒక హీరోయిన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన నిర్మాత డివివి దానయ్యతో మాట్లాడి రాశిఖన్నా డేట్లు తీసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

మెగా హీరో రామ్‌ చరణ్‌, నందమూరి హీరో ఎన్టీఆర్‌ల కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్నాడు. ‘బాహుబలి’ కోసం దాదాపు నాలుగు సంవత్సరాలు తీసుకున్న జక్కన్న ఈ చిత్రానికి అంత సమయం తీసుకోవడం లేదు. అలాగే ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌ను కూడా ఎక్కువగా ఉపయోగించడం లేదు. గ్రాఫిక్స్‌ లేకుండా ఒక భారీ కాప్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించబోతున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా రాశిఖన్నా ఎంపిక అవ్వడం ఆమె కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఆఫర్‌గా చెప్పుకోవచ్చు.