ఆర్య స్వయంవరం… 70 వేల మంది

Arya selects Wife through Reality show
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పూర్వ కాలంలో యువ రాణులకు స్వయంవరంను నిర్వహించేవారు. అలాంటి స్వయంవరంలోనే సీతాదేవిని రాముడు శివదనస్సు ఎక్కు పెట్టి వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అలాంటి స్వయంవరాలు ప్రస్తుత జనరేషన్‌లో దాదాపు అసాధ్యం అని చెప్పాలి. కాని తమిళ హీరో ఆర్య మాత్రం తన భాగస్వామిని ఎన్నుకునేందుకు స్వయంవరంను ప్రకటించాడు. ఒక ఛానెల్‌ ద్వారా ఒక రియాల్టీ షోను నిర్వహించి, ఆ రియాల్టీ షోలో ఫైనల్‌ విజేతగా నిలిచిన అమ్మాయిని భార్యగా చేసుకోవాలని ఆర్య భావించడాట.

ఆ రియాల్టీ షో కోసం తాజాగా సదరు ఛానెల్‌ ప్రకటన చేసింది. ఆ ఛానెల్‌ వారు ఇలా ప్రకటించారో లేదో వెంటనే 70 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయిదు పది వేలలో దరఖాస్తులు వస్తాయని భావించిన షో నిర్వాహకులు 70 వేల మంది దరఖాస్తు చేయడంతో అవాక్కయ్యారు. ఏం చేయాలో పాలుపోక తల పట్టుకున్నారు. అందులోంచి అందమైన మరియు ఆర్యకు తగ్గ సరిజోడి అమ్మాయిలను 1000 మందిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. అందులోంచి మూడు దశల్లో షార్ట్‌ లిస్ట్‌ చేసి 20 మందిని ఎంపిక చేయనున్నారు. ఆ 20 మంది రియాల్టీ షోలో పాల్గొని ఆర్యను వివాహం చేసుకునే అవకాశం దక్కించుకోగలరు. ఆర్య స్వయంవరం విషయం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది తమిళనాడు అయ్యింది.