నాని మూవీ అక్కడ ఫ్లాప్‌ అయ్యింది…!

Nani Movie flap there in tmail bhale bhale magadivoyee

నాని హీరోగా తెరకెక్కిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం పెట్టుబడికి మూడు రెట్ట వసూళ్లను సాధించి పెట్టింది. నాని కెరీర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రాల జాబిత తీస్తే ఖచ్చితంగా ఆ చిత్రం ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి విజయాన్ని దక్కించుకున్న భలే భలే మగాడివోయ్‌ చిత్రాన్ని ‘గజినికాంత్‌’గా రీమేక్‌ చేయడం జరిగింది. ఆర్య హీరోగా సాహేసా సైగల్‌ హీరోయిన్‌గా నటించిన ‘గజినికాంత్‌’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొంది, విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

Bhale Bhale Magadivoy

తమిళ చిత్రం ప్రేక్షకులకు గజినికాంత్‌ ఎక్కలేదు. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తమిళంలో దించేశారు. దాంతో అక్కడ ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. తమిళనేటివిటీకి దూరంగా ఉందంటూ కొందరు రివ్యూలు రాశారు. తమిళ నేపథ్యంకు అనుగుణంగా సినిమాను మార్చి ఉంటే బాగుండేది. దానికి తోడు హీరో పాత్రను ఎక్కువగా హైలైట్‌ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఇక ఆర్య హీరోగా పెద్దగా అలరించలేక పోయాడు. మతిమరుపు కలిగిన వ్యక్తిగా ఆర్య పెద్దగా నవ్వించలేక పోయాడు. కాని నాని మాత్రం తన సహజ సిద్దమైన నటనతో హీరో పాత్రలో నటించి మెప్పించాడు. కాని ఆర్య మాత్రం ఆకట్టుకోలేక పోయాడు. ఇలా పలు కారణాల వల్ల తమిళంలో రీమేక్‌ అయిన భలే భలే మగాడివోయ్‌ చిత్రం ఆకట్టుకోలేక పోయింది.

Tamil featuring Gajinikant