అంచనాలు మరీ పెంచేస్తున్న శ్రీనివాసుడు….

Victory Voice Over For Srinivasa Kalyanam movie

నితిన్‌, రాశిఖన్నా జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిన విషయం పోస్టర్స్‌ మరియు ట్రైలర్‌ చూస్తేనే అనిపిస్తుంది. సినిమాలో పెళ్లి గురించి, కుటుంబ విలువల గురించి చూపిస్తున్నాం అంటూ మొదటి నుండి కూడా అంచనాలు భారీగా పెంచేశారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సతీష్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రం అంచనాలను విడుదలకు ముందు మరింతగా పెంచేలా చిత్రంకు వెంకటేష్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించారు.

Victory Voice Over For Srinivasa Kalyanam movie

ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఎఫ్‌ 2’ చిత్రంలో నటిస్తున్న వెంకటేష్‌ అడిగిన వెంటనే ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు మందుకు వచ్చాడు. దిల్‌రాజు ఇలాంటి మంచి సినిమాలను నిర్మించడంలో ఆయనకు ఆయనే సాటి. తప్పకుండా ఈ చిత్రం ఆయన బ్యానర్‌కు మంచి పేరును తీసుకు వస్తుందనే నమ్మకం ఉంది అంటూ వెంకటేష్‌ చెప్పుకొచ్చాడు. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీనివాస కళ్యాణం కోసం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ ఆడియన్స్‌ కూడా విపరీతంగా ఎదురు చూస్తున్నారు. వెంకీ వాయిస్‌ ఓవర్‌తో ఈ చిత్రం ప్రారంభం అవుతుందని, సినిమాకు వెంకటేష్‌ వాయిస్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత లక్ష్మణ్‌ అన్నారు. తప్పకుండా ఇది మరో శతమానంభవతి సినిమాగా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.