“ఈగల్” విషయంలో క్లారిటీ ఇచ్చిన రవితేజ…!

“ఈగల్” విషయంలో క్లారిటీ ఇచ్చిన రవితేజ
Cinema News

మాస్ మహారాజ రవితేజ హీరోగా కావ్య థపర్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా మూవీ ఈగల్. మరి మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ ఈ సంక్రాంతి రేస్ నుంచి ఫిబ్రవరికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన మాస్ మహారాజ్ రవితేజ ఈ మూవీ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ క్లారిటీ అయితే కొందరికి అందించారు.

“ఈగల్” విషయంలో  క్లారిటీ ఇచ్చిన రవితేజ
Eagle Movie

చాలా మంది ఈ మూవీ ఒక సీరియస్ యాక్షన్ మూవీ మాత్రమే అనుకుంటున్నారని కానీ ఈ మూవీ లో ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందని కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాదని తెలిపారు. సో ఇప్పుడు వరకు మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్ ట్రైలర్ లతో ఈ మూవీ కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే అనుకున్న వారికి రవితేజ ఈ క్లారిటీ కూడా ఇవ్వడంతో మరికొంతమందిని ఈ మూవీ థియేటర్స్ కి వచ్చేలా చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ మూవీ ఈ ఫిబ్రవరి 9న తెలుగు సహా హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది.