రాజా నిజంగానే ది గ్రేట్‌…

Ravi Teja Raja The Great Movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్‌ తీసుకుని ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో మాస్‌ మహారాజ రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనీల్‌రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుంది. దీపావళి సందర్బంగా విడుదలైన ఈ సినిమా మాస్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముందు నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటికే 50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన రాజా ది గ్రేట్‌ ఇంకా సందడి కొనసాగిస్తూనే ఉంది.

Raja The Great movie

రవితేజ కెరీర్‌లో ఇప్పటి వరకు నైజాం ఏరియాలో 10 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ను సాధించలేదు. మొదటి సారి నైజాంలో 10 కోట్లు సాధించి బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను రవితేజ అందుకున్నాడు. నైజాం ఏరియాలో 10 కోట్లు సాధించింది అంటే ఆ సినిమా సక్సెస్‌గా భావించొచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకు పోతుంది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నాడు.

మొదటి సారి రవితేజ ఈ చిత్రంలో అంధుడిగా నటించాడు. రాధిక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగింది. రవితేజకు జోడీగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. దసరా సీజన్‌ తర్వాత వచ్చిన ఈ సినిమా అన్‌ సీజన్‌లో కూడా మంచి ఫలితాన్ని రాబట్టింది. దిల్‌రాజుకు భారీ లాభాలను తెచ్చి పెడుతున్న ఈ సినిమాతో దర్శకుడు అనీల్‌ రావిపూడితో సినిమాలు చేసేందుకు హీరోలు క్యూలు కడుతున్నారు.