రాజా ది గ్రేట్ కొత్త పోస్టర్ ఇదే …

raviteja-raja-the-great-movie-new-poster-release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రవితేజ, మెహ్రీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న రాజా ది గ్రేట్ సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు, రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే వున్నాయి. ఒకప్పుడు వీళ్ళ కాంబినేషన్లో దర్శకుడు బోయపాటిని పరిచయం చేస్తూ తీసిన భద్ర సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రాజా ది గ్రేట్ మీద అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.  

రాజా ది గ్రేట్ కొత్త పోస్టర్ ఇదే ... - Telugu Bullet

రవితేజ అంధుడి పాత్ర పోషిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 12 న విడుదల అయ్యే అవకాశం వుంది. ఈ ఏడాది ఫిబ్రవరి లో రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ మొదలైంది. చిన్న చిన్న అంతరాయాలు కారణంగా సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. అయినా రవితేజ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఎలెమెంట్స్ ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయని దర్శకనిర్మాతలు ధీమాగా వున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త పోస్టర్ ఒకటి విడుదల చేశారు. మీరు చూస్తున్న ఆ పోస్టర్ లో హీరోయిన్ సెల్ఫీ తీస్తుంటే అంధుడు అయిన రవితేజ ఎలా ఫోజ్ ఇచ్చాడో చూడండి.