‘మా’ కి శివాజీ రాజా రాజీనామా చేసింది అందుకేనా ?

reason behind Sivaji Raja's resignation for 'Ma'

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

శ్రీరెడ్డి వ్యవహారం మొదలయిన రోజు నుండి అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. తన మీద కుట్ర జరిపే తన తల్లిని తిట్టించారని భావిస్తున్న ఆయన ఉగ్రరూపం దాల్చారు. టీఆర్పీల కోసం మీడియా ప్రవర్తిస్తున్న తీరుతో విసిగిపోయానని వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను అంటూ ఫిలిం ఛాంబర్ కెళ్ళి మొత్తం మీడియా అంతటినీ తన మీద ద్రుష్టి మరల్చేలా చేసాడు. ఛాంబర్ కెళ్ళిన పవన్ కళ్యాణ్ ‘మా’ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి ఇష్యూను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందే పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదని పవన్ అన్నట్లు తెలుస్తోంది.

నా తల్లిని తిట్టినందుకు న్యాయం జరిగేవరకు నేను ఫిల్మ్ ఛాంబర్ నుండి కదలనంటూ ఫిల్మ్ ఛాంబర్ వద్ద నిన్న కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు పవన్. అయితే పోలిసుల సూచనల మేరకు ఇంటికి వెళ్ళిపోయిన పవన్ 24గంటల్లో నాకు న్యాయం జరిగేలా చూడాలని లేకపోతే నేను ఏంటో చూపిస్తానంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. అందుకే ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందో అని భావించిన మా అధ్యక్షుడు శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాక ఇటీవ‌ల చిత్ర‌సీమ‌ని చుట్టిముట్టిన వివాదాల‌లో ప‌రోక్షంగా `మా` వైఫ‌ల్యం కూడా ఉందని శ్రీ‌రెడ్డి పై నిరంకుశ‌త్వ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ఈ వ్య‌వ‌హారం బాగా ముదిరిపోయింద‌ని ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌లు సైతం బ‌హిరంగంగానే చెప్పారు. మంచు విష్ణు అయితే..ఏకంగా `మా` వైఖ‌రి ఎండ‌గ‌డుతూ ఓ లేఖ రాశాడు. అందులో ‘మా’ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపించాడు. వీట‌న్నింటికీ బాధ్య‌త వ‌హిస్తూ ‘మా’అధ్య‌క్షుడు శివాజీ రాజా రాజీనామా చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. శివాజీ రాజా తన పదవికి రాజీనామా చేసినా అసోసియేషన్ అతని రాజీనామాని ఆమోదిస్తున్నట్టు ఇంకా ప్రకటన చేయలేదు.