కన్నుఅదిరితే ఏమవుతుందో తెలుసా….

కన్నుఅదిరితే ఏమవుతుందో తెలుసా....

మన దేశంలో మూఢ నమ్మకాలు ఎక్కువనే సంగతి తెలిసిందే. మన శరీరంలో ఏ చిన్న మార్పు లేదా మచ్చలు కనిపించినా దానికో కారణం ఉంటుందని నమ్ముతారు. చేతి రేఖలు, పుట్టి మచ్చలు భవిష్యత్తును చెబుతాయని భావిస్తారు. అంతేకాదు.. కుడి కన్ను అదిరితే మంచి జరగబోతుందని, ఎడమ కన్ను కట్టుకుంటే కీడు జరుగుతుందని అంటారు. అయితే, మంచి చెడులను తెలియజేయడానికే కన్ను కొట్టుకుంటుందా లేదా శరీరంలో ఏదైనా సమస్య వల్లా అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

కన్ను అదరడానికి కారణాలు ఇవే:

  • మెదడు లేదా నరాల లోపాల వల్ల కన్ను అదురుతుంది. అయితే, ఇది చాలా అరుదైన లక్షణం. బెల్ పాల్సీ, డిస్టోనియా, సెర్వికల్ డిస్టోనియా, మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్ వ్యాధి, టూరెట్ సిండ్రోమ్ సమస్యలను కూడా ఇది సూచిస్తుంది.
  •  చాలామందిలో అధిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. మీ కన్ను అదురుతున్నట్లయితే మీరు వెంటనే ఒత్తిడిని దూరం చేసుకోడానికి ప్రయత్నించండి.ఎక్కువ సేపు టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లను చూసినా కళ్లు ఒత్తిడికి గురవ్వుతాయి. కాబట్టి.. మధ్య మధ్యలో మీరు కంటికి విశ్రాంతి ఇవ్వడం మంచిది.
  •  చాలామందిలో నిద్రలేమి వల్ల కూడా కళ్లు అదురుతాయి. మనిషికి కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం. కాబట్టి.. నిద్రను దూరం చేసుకుని కళ్లపై ఒత్తిడి పెంచకండి. కాఫీ లేదా చాక్లెట్లు ఎక్కువగా తినేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోందట. కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడమే ఉత్తమం.
  • కళ్లు పొడిబారినా సరే ఈ సమస్య ఏర్పడుతుంది.మద్యం అతిగా తాగేవారిలో కూడా కన్ను అదిరే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.ఒత్తిడి లేకుండా, బాగా నిద్రపోతూ.. కెఫీన్, మద్యానికి దూరంగా ఉండటం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ కన్ను పదే పదే అదురుతుంటే.. మంచిదే అనుకొని నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.