అసలు ముకేష్ కు ఏం కావాలి..?

reliance-industries-to-offer-free-wifi-connectivity-to-colleges

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మొన్నటికి మొన్న వాయిస్ కాల్స్ ఫ్రీ అంటే అంతా ఆశ్చర్యపోయారు. తర్వాత ఫోన్ ఫ్రీ అంటే నోరెళ్లబెట్టారు. ఇప్పుడు ఏకంగా మూడున్నర కోట్ల మంది కాలేజీ విద్యార్థులకు వైఫై ఫ్రీ అంటుంటే.. కేంద్రానికే దిమ్మ తిరిగిపోతుంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ అసలేం చేస్తున్నారో ఆయన కార్పొరేట్ ప్రత్యర్థులకే కాదు పొలిటీషియన్స్ కు కూడా అర్థం కావడం లేదు.

కొంపదీసి ముకేష్ రాజకీయాల్లోకి వస్తారేమోనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెగ టెన్షన్ పడుతున్నాయి. జియో రాకతో అంబానీ పేరు మార్మోగిపోతోంది. యూత్ అంతా ముకేష్ మంత్రం జపిస్తున్నారు. రేపు జియో ఫోన్ మార్కెట్లోకి వస్తే ఇక ఆయన దూకుడు ఆపడటం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి సమయంలో ఫ్రీ వైఫై అంటూ కాలేజీ విద్యార్థులకు ప్రకటించిన స్కీమ్ ప్రకంపనలు రేపుతోంది.

దేశ ప్రధాని మోడీ కూడా సాధించలేని డిజిటల్ ఇండియాను ముకేష్ సాధించేలా కనిపిస్తున్నారు. చిన్న ఫోన్ కేబుల్ ద్వారా కేబుల్ టీవీ ఛానెల్స్ అన్నీ చూడొచ్చన్న ముకేష్ ప్రకటన వేలాది గ్రామాల్లో ప్రజలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కేబుల్ సరిలేదని, బాగుచేయడానికి రోజుల తరబడి టైమ్ తీసుకునే ఆపరేటర్ల బెడద తప్పిందని జనం సంతోషిస్తున్నారు. మరి నిజంగానే ఫోన్ కేబుల్ తో టీవీ ఛానెల్సన్నీ వచ్చేస్తే ఇక ముకేష్ దేవుడైపోతాడేమో.

మరిన్ని వార్తలు:

ఈ ఛార్మికి ఏమైంది..?

వెంకయ్య వేదన తీరనిది

ఛార్మి ఆ ఆప్షన్ ఎందుకు వద్దంది..?