జియో రూ.1000 4జీ ఫోన్‌

Reliance Jio may launch Rs 1000 Lyf phone with 4G VoLTE, free calls

మొబైల్‌ ఫొటోన్‌ వాడటం ప్రారంభించిన కొత్తలో రూ.500లకే రిలయన్స్‌ ఫోన్‌ ఇచ్చింది గుర్తుందా.. అప్పట్లో అదో సంచలనం.. ఆ తరవాత అన్నదమ్ములు విడిపోయి రిలయన్స్‌మొబైల్స్‌ తమ్ముడు అనిల్‌కి వెళ్లింది.. దాంతో చాలా కాలం ఆ రంగానికి దూరంగా ఉన్న అన్న ముఖేష్‌ కొత్త అస్త్రం జియోతో మార్కెట్‌కి వచ్చారు.. అప్పటి నుంచి అన్నీ సంచలన నిర్ణయాలే.. తాజాగా మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. రూ.1000 లకే 4జీ ఫోన్‌ ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 100 కోట్ల ఫోన్లు వినియోగంలో ఉన్నా వాటిలో 60 శాతం ఫీచర్‌ ఫోన్లే ఉన్నాయి.. అటువంటి వారికి ఇంటర్నెట్‌ డాటా ఉపయోగాలపై పెద్దగా అవగాహన ఉండదు.. కొత్తగా వచ్చిన జియో మాత్రం కేవంల 4జీ ఆధారిత కాల్స్‌ మాత్రమే చేయగలం.. ఇప్పుడు ఈ ఫీచర్‌ ఫోన్‌ ఉన్నవారు స్మార్ట్‌ఫోన్‌ బాట పట్టేందుకు కొంత సమయం తీసుకుంటుంది కనుక ఆ విభాగంలోనే తక్కువలో ఫోన్‌ తీసుకురావాలని సంస్థ భావిస్తుంది. 4జీతోపాటు వోల్టీ పరిజ్ఞాం కూడా ఉండేలా లైఫ్‌ మొబైల్‌ ద్వారా తీసుకురాబోతుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, అన్‌లిమిటెడ్‌ వీడియో కాలింగ్‌ సౌకర్యం కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. డాటా మాత్రం ఆయా ప్లాన్ల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. మరి ఈ నిర్ణయంతో ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులు జియో వైపు మళ్లడంతోపాటు.. ఇప్పటి వరకు ఫోన్‌ పట్టని వారు సైతం కొనుగోలు చేస్తారని అంచనా వేస్తున్నారు.