మోకాళ్ళ నొప్పికి చింతగింజల వైద్యం…

Relieve Your Knee Pain With Tamarind Seeds

ఒకప్పుడు ముసలి వయసులో ఉన్నవాళ్లు ‘మోకాళ్ల నొప్పులు’ అంటూ ఉంటె… వయసు అయిపోయిందని అనుకునే వారు. కానీ ఈ కాలంలో వయసుతో సంబంధం లేకుండా… అందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం.. ఆహారపు అలవాట్లు. ఈ మోకాళ్ళ నొప్పులతో నే కాలం భారంగా గడుపుతూ ఉంటారు. ఇంకొందరు డబ్బులు ఉన్నవాళ్లు.. లక్షలు పోసి మందులు వాడిన వారు ఉన్నారు. అయినా వారికి ఆ నొప్పులు తగ్గడం లేదు. అయితే.. ఎన్ని మందులు వేసుకున్నా.. తగ్గని మోకాళ్ళ నొప్పులు మనం చింతకాయలు, చింతపండు తిని పారేసే చింత గింజలతో తగ్గుతుందని నిరూపితం అయింది. ఆయుర్వేద నిపుణులు సైతం ఈ వైద్యాన్ని అంగీకరిస్తున్నారు.

చింతకాయలు, చింతపండు తిన్నాక వచ్చే.. చింతగింజలను ఉపయోగించి మోకాళ్ల నొప్పికి మంచి ఔషదం తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం.

1: చింతగింజలను పండుగా వేయించాలి. 
2: బాగా వేగిన చింతగింజలను 2 రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. 
3 : నీటిని మారుస్తూ 2 రోజులు నానిన తర్వాత వాటి పొట్టు త్వరగా వస్తుంది. 
4: పొట్టును తీసి.. చింతగింజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టాలి. 
5: ఎండిన తర్వాత ఆ చింతగింజలను మిక్సీ లో వేసి పొడిలాగా తయారు చేసుకోవాలి. 
6: ఆ పొడిని ప్రతి రోజూ ఒక్కో స్పూన్‌ చొప్పున రెండు సార్లు నీటిలో లేదా పాలల్లో కలుపుకుని తాగాలి.
ఇలా చేయడం వల్ల 30 రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుండి శాస్వత పరిష్కారం దొరుకుతుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గని వారికి.. ఈ అద్భుత మందుని అందరికి తెలియ చేయడానికి షేర్ చేయండి.