రేవంత్ దగ్గరికి టీడీపీ దూత.

kambhampati rammohan rao meets to Revanth reddy for TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలంగాణ టీడీపీ లో రేవంత్ ప్రకంపనలు ఆగలేదు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రాహుల్ తో భేటీ అయినట్టు, ఇక కాంగ్రెస్ లో చేరడమే మిగిలింది అన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నేతలు చాలా మంది రేవంత్ తో మాట్లాడారు. అయితే ఆ మాటలు నమ్మొద్దని రేవంత్ చెబుతూ వచ్చారు. కానీ ఢిల్లీ పరిణామాలు భిన్నంగా ఉండటంతో రేవంత్ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదని టీడీపీ భావిస్తున్నట్టు వుంది.

టీడీపీ, తెరాస పొత్తు కుదురుతుందన్న వార్తల నేపథ్యంలో రేవంత్ బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఓ వైపు తాను నేరుగా సీఎం కెసిఆర్ తో తలబడుతుంటే పార్టీ సీనియర్ నేతలు తెరాస కి అనుకూలంగా మాట్లాడడాన్ని రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారట. అనంత లో పరిటాల శ్రీరామ్ వివాహం సందర్భంగా జరిగిన ఘటనలతో రేవంత్ ఇక టీడీపీ తో కొనసాగడం వల్ల లాభం లేదని అంచనాకి వచ్చారు. అయితే రేవంత్ మనోవేదన అర్ధం చేసుకుని చంద్రబాబు పార్టీ సీనియర్స్ కి క్లాస్ పీకడంతో అంతా సద్దుమణుగుతుందని అనుకున్నా అలా కాకుండా సీన్ ఢిల్లీకి మారింది.

ఈ పరిస్థితుల్లో రేవంత్ తో టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు భేటీ అయ్యారు. ఆయన అధిష్టానం దూతగానే రేవంత్ తో సమావేశం అయ్యి ఉంటారని భావిస్తున్నారు. ఈ భేటీలో రేవంత్ ఏమి చెప్పింది బయటికి తెలియడం లేదు. అయితే ఇది కేవలం వ్యక్తిగత సమావేశం అనడం ద్వారా కంభంపాటి హీట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా లోపల నుంచి వస్తున్న పొగలు చూస్తుంటే ఇంకా సెగలు రగులుతున్నట్టే వుంది.