జీవీఎల్ కు బహిరంగ లేఖ…గోప్పోడట…!

Revealed Letter To GVL

భారతీయ జనతా పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆ పార్టీకే తలనొప్పిగా తయారయ్యారనిట, ఈ మాట ఎవరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ స్వయానా ఆ పార్టీ నేతల గుసగుసలు ఆడుకుంటున్నారు. అదేంటి అంటారా నిజమే మరి తలాతోకా లేకుండా విమర్శలతో విరుచుకుపడుతూ రాజకీయ ప్రత్యర్థులను ఆడిపోసుకోవడానికి అయన పడే తపన ఆ పార్టీకే పరువు తక్కువ అనేది బీజేపీ నేతలు కనిపెట్టేసారు మరి. ఏపీలో తిత్లీ తుపాను ఉత్తరాంధ్రను దారుణంగా దెబ్బతీసి ఉన్న సమయంలో పార్టీలన్నీ కూడా దాదాపుగా తిత్లీ గురించే మాట్లాడుతున్నాయి.

Open Letter To GVL

దిండి అన్నా బెండి అన్నా పవన్ కూడా దాదాపు ఈ విషయం మీదే ఉన్నాడు. తిత్లీ బాధితులకు కేంద్రం కనీస సహాయం కూడా అందించలేదన్న దిశగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికి తగ్గట్టు ఇక్కడికి ఒక్క కేంద్ర ప్రతినిది కానీ, సహాయ మంత్రి సహా ఎవరూ రాలేదు ఇలాంటి నేపథ్యంలో అసలు తిత్లీ గురించి నోరెత్తకుండా.. ఎంతసేపూ సీఎం రమేష్ మీద జరిగిన ఐటీదాడుల గురించి రోజుకు రెండుసార్లు మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడుతుండడం అక్కడ ఆ పార్టీకే ఇబ్బందిగా ఉంది. తాజాగా ఇదే విషయం మీద కడుపు మండిన ఒక ఆంధ్రా పౌరుడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరూ చదివెయ్యండి మరి.

gvl

gvl2