కూతురు తలంటినా వర్మ మారలేదు…

RGV Comments on Pawan kalyan son Name RGV daughter Scold him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎవరి పెళ్ళికో ఇంకెవరిదో సందడి అన్నట్టు వుంది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కొడుక్కి “మార్క్ శంకర్ పవనోవిచ్” అని పేరు పెట్టుకోవడం మీద కూడా రాము ఎవరికీ అర్ధం కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. పవన్ తన పేరు, తన భార్య పేరు, అన్న చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ లోని శంకర్ కూడా కలిసి వచ్చేలా కొడుకు పేరు పెట్టుకున్నందుకు రాము రియాక్ట్ అయ్యాడు. ఈ పేరు ప్రపంచంలో అతి గొప్పదని, భాషలు పుట్టాక ఇలాంటి పేరు వినలేదని తన పైత్యం మొత్తం రంగరించి ఓ పోస్ట్ పెట్టాడు.

https://telugu.telugubullet.com/rgv-comments-on-pawan-kalyan-son-name-mark-shankar-pawanovich-rgv-daughter-scold-him/

పవన్ కొడుకు పేరు మీద కామెంట్ చేసిన తండ్రిని వర్మ కూతురు విసుక్కుంది. పెద్ద పెద్ద మాటలు, సంబంధం లేని చరిత్ర తెచ్చి ఇలా పోస్టులు పెట్టడం తెలివితక్కువగా మాట్లాడ్డం తప్ప ఇంకోటి కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయినా వర్మ ఊరుకోలేదు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కాబట్టే తన కూతురు అలా మాట్లాడిందని అంటూ ఆమెకి కౌంటర్ గా ఇంకో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇంకాస్త సంక్లిష్టం గా వుంది.

వర్మ తీరు చూస్తుంటే ఆయన్ని ఈ లోకం, ప్రజలు, చివరకు కూతురు సైతం అర్ధం చేసుకోవడం లేదని బాధగా ఉన్నట్టుంది. ఆయన్ని బాగా అర్ధం చేసుకునే పరిణితి, పరిపక్వత వున్న ఇంకో లోకం ఎక్కడైనా ఉంటే ఆయన్ని అక్కడికి పంపిస్తే మేలు. ఎప్పుడన్నా వర్మకి జనాల బాధ, జనాలకి వర్మ బాధ తప్పుతుంది.

RGV Comments on Pawan kalyan son Name

RGV Comments on Pawan kalyan son Name