పవన్ కళ్యాణ్ కూతురు, కొడుకు పేరు వెన‌క క‌థ‌…

Behind the story of pawan kalyan son name Mark Shankar pawanovich

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల పుట్టిన త‌న కొడుక్కి పెట్టిన పేరుపై సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ తన కొడుక్కు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కొణిదెల అని పేరు పెట్టారు. ప‌ల‌క‌డానికి కాస్త చిత్రంగా ఉన్నా… ఈ పేరు వెన‌క చాలా క‌థే ఉంది. ప‌వ‌న్ త‌న ఆలోచ‌న‌ల‌కు ఎంత విలువ ఇస్తారో, భార్య అన్నా లెజినోవా న‌మ్మ‌కాల‌నూ అంతే గౌర‌విస్తారు. ర‌ష్య‌న్ అయిన అన్నా లెజినోవా ర‌ష్య‌న్ ఆర్థోడ‌క్స్ మ‌త సంప్రదాయాల‌ను న‌మ్ముతారు. క్రైస్త‌వ మతంలో మార్క్ అనే పేరుకు చాలా ప్రాచుర్యం ఉంది. మార్క‌స్ అనే దేవుడికి మార్క్ సంక్షిప్త నామం. అందుకే ప‌వ‌న్ త‌న భార్య ఇష్టానికి అనుగుణంగా కుమారుడి పేరును మార్క్ తో ప్రారంభించారు.

pawan-kalyn-son-name-mark-s

ఇక శంక‌ర్ విష‌యానికొస్తే… చిరంజీవి అస‌లు పేరు శివ‌శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ లోని శంక‌ర‌ను త‌న కొడుకు పేరులో క‌లిపారు. త‌న పేరు ప‌వ‌న్ ను ప‌వ‌నోవిచ్ గా మార్చి మొత్తం క‌లుపుతూ మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అని పేరు పెట్టారు. ప‌వ‌నోవిచ్ అని పెట్ట‌డం కూడా అన్నా లెజినోవా మ‌తాన్ని ప్ర‌తిబింబించేదే. పాశ్చాత్య దేశాల పౌరుల పేర్లు ఇలా ఇచ్ ల‌తో ఎండ్ అవడం చూస్తుంటాం. జ‌కోవిచ్, ఇవ‌నోవిచ్… త‌రహాలోనే కుమారుడికి ప‌వ‌న్ ప‌వనోవిచ్ అని పెట్టార‌న్న‌మాట‌. అలాగే ప‌వ‌న్, అన్నాలెజినోవా కుమార్తె పొలెనా పేరు వెన‌క కూడా ఇలాంటి క‌థే ఉంది.

pawan kalyan daughter polena

పొలెనా పూర్తిపేరు పొలెనా అంజనా ప‌వ‌నోవా. త‌ల్లి అంజ‌నాదేవి పేరులోని అంజనాను కుమార్తెకు పెట్టారు. అలాగే త‌న పేరును పాశ్చాత్య త‌ర‌హాలో ప‌వ‌నోవాగా మార్చి మొత్తం క‌లిపి పొలెనా అంజ‌నా ప‌వ‌నోవా అని పెట్టారు. త‌ల్లి అన్నా లెజినోవా అయితే కూతురు పొలెనా అంజనా ప‌వ‌నోవా అన్న‌మాట‌. మొత్తంగా త‌న ఇష్టంతో పాటు భార్య అభిప్రాయానికి త‌గ్గ‌ట్టుగా ఇద్ద‌రి పిల్ల‌ల పేర్లు పెట్ట‌డం ద్వారా తాను ఎంత విభిన్న‌మైన వ్య‌క్తో మ‌రోసారి నిరూపించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.