తెలంగాణాలో టీడీపీ బలం ఎంతో చెప్పిన కెసిఆర్.

KCR plans to alliance with ttdp for 2019 elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణాలో ఒక్కసారిగా రాజకీయ కాక పెరిగింది. 2019 ఎన్నికల కేంద్రంగా రానున్న రోజుల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోందో అప్పుడే చర్చ మొదలైంది. ఏ ఏ పార్టీల మధ్య పొత్తులు పొడుస్తాయి? ఏ ఏ పార్టీలు జుట్టు జుట్టు పట్టుకుంటాయి అన్నదానిపై అంచనాలు, విశ్లేషణలు మొదలు అయ్యాయి. ఇటీవల ABN రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో రాసినట్టు తెలంగాణాలో వెల్ కం గ్రూప్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కెసిఆర్ కి వ్యతిరేకంగా రెడ్లంతా ఏకం అవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో మిగిలిన వర్గాలు చేజారిపోకుండా కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. వారిని ఆకట్టుకోడానికి తెరాస జెండా కింద అలుపెరగని ప్రయత్నాలు చేయడం కన్నా టీడీపీ తో పొత్తు వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని కెసిఆర్ భావిస్తున్నారట.

chandrababu-and-kcr

రేవంత్ వెళ్లిపోక ముందే కెసిఆర్ ఆలోచనలు టీటీడీపీ లోని సీనియర్ నేతల దగ్గరికి చేరినా ఎవరూ పెద్దగా స్పందించలేదట. తాజాగా రేవంత్ ఎపిసోడ్ అయ్యాక కూడా తెరాస వైపు నుంచి ఇలాంటి పొత్తు ప్రతిపాదన వచినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ ఆఫర్ ప్రకారం టీటీడీపీ పొత్తుకు ఒప్పుకుంటే 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ సీట్లు ఇవ్వడానికి రెడీ అన్నట్టు గులాబీ బాస్ నుంచి సంకేతాలు వున్నాయట. ఇదే నిజం అయితే తెలంగాణాలో టీడీపీ బలం ఎంతో కెసిఆర్ చెప్పినట్టే. అసలు తెలంగాణాలో టీడీపీ ఎక్కడుంది అని అడిగిన తెరాస నేతలు ఇప్పుడు పొత్తు కోసం చూపిస్తున్న ఆసక్తి, ఇస్తున్న ఆఫర్ దేశం శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వచ్చిన చంద్రబాబు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందనడంలో సందేహం లేదు.