పవన్‌ కొడుకు బర్త్‌డే వేడుకలో చరణ్‌

Ram Charan in Pawan Kalyan Son Akira Birthday Celebrations

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ల కొడుకు అకీరా నందన్‌ పుట్టిన రోజు ఇటీవలే జరిగింది. ఆ వేడుకలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నాడు. ఆ విషయాన్ని తాజాగా రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. తాజాగా ఆ బర్త్‌డే వేడుకలో రామ్‌ చరణ్‌ కూడా పాల్గొన్నాడు అని తెలుస్తోంది. ముంబయిలో అకీరా బర్త్‌డే వేడుకలో పవన్‌తో పాటు రామ్‌ చరణ్‌ కూడా పాల్గొని తమ్ముడుకు విశెష్‌ చెప్పడం జరిగింది. బాబాయి అంటే ఎంతో అభిమానం ఉన్న చరణ్‌ తన తమ్ముడి బర్త్‌డే వేడుకలో గతంలో కూడా పాల్గొన్నాడు. అయితే ఈసారి ప్రత్యేకంగా పవన్‌తో కలిసి, ముంబయిలో నిర్వహించడం జరిగింది.

అకీర బర్త్‌డే వేడుకలో చెల్లి ఆద్య సందడి చేసింది. తమ్ముడు అకీర, చెల్లి ఆద్యతో చరణ్‌ సరదాగా టైంను స్పెండ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా పవన్‌ కళ్యాణ్‌కు చాలా దగ్గరగా పవన్‌ ఉంటున్నాడు. ఆ మద్య మెగా ఫ్యామిలీతో పవన్‌ చాలా దూరంగా ఉంటున్నాడు అంటూ ప్రచారం జరిగేది. కాని పవన్‌ కళ్యాణ్‌ను కుటుంబంకు దగ్గర చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే చరణ్‌ బర్త్‌డేలో పవన్‌ సందడి చేశాడు, అలాగే రంగస్థలం చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ తాజాగా చూసి చరణ్‌కు అభినందనలు తెలియజేయడం జరిగింది.