‘రంగస్థలం’పై పవన్‌ కామెంట్స్‌

Pawan Kalyan Watched Rangasthalam Movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు సినీ వర్గాల వారి నుండి కూడా ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక షో ద్వారా కుటుంబ సమేతంగా చూడటం జరిగింది. పవన్‌ తన భార్య అన్నా లెజనోవాతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు రామ్‌ చరణ్‌, నిర్మాతలతో కలిసి సినిమా చూశాడు. సినిమా పూర్తి అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు.

‘రంగస్థలం’ చిత్రం తన మనసుకు హత్తుకుందని, ‘తొలిప్రేమ’ చిత్రం తర్వాత నేను బయట చూసిన సినిమా ఇదే. మొదటి నుండి జరుగుతున్న ప్రచారం కారణంగా సినిమాను థియేటర్‌లో చూడాలని కోరుకున్నాను. చాలా మంచి సినిమా, నా మనసుకు నచ్చిన సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు సుకుమార్‌ ఒక మంచి సినిమాను తెరకెక్కించారు. చరణ్‌ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రలు చేయాలంటే సాదారణ విషయం కాదు. చరణ్‌ ఇలాంటి సాహస పాత్ర చేయడం అభినందనీయం అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమా గురించిన ఇంకా చాలా విషయాలు సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న సమయంలో మాట్లాడుతాను అంటూ చెప్పుకొచ్చాడు.