ఐఫోన్స్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన మహేష్‌

Mahesh Babu Present Iphone Gifts to his Staff

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘శ్రీమంతుడు’ చిత్రంతో తనకు సూపర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకు మహేష్‌బాబు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చిన విషయం తెల్సిందే. మహేష్‌బాబు తన సహాయకులకు, తన సినిమాలకు వర్క్‌ చేసిన వారికి ఎప్పటికప్పుడు బహుమానాలు ఇవ్వడం ఎప్పుడు చూస్తేనే ఉంటాం. తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదల కాబోతున్న సమయంలో తన సిబ్బందికి ఐఫోన్‌లను గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. మహేష్‌బాబు భార్య నమ్రత స్వయంగా వారికి ఐఫోన్‌లను బహుమతిగా ఇచ్చారు. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ వారు భరత్‌ అనే నేను చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. వారి కష్టంకు ప్రతిఫలంగా బహుమానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మహేష్‌బాబు, కొరటాల శివల కాంభినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ నెల 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానయ్య నిర్మించిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్‌ చేయడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. 200 కోట్ల టార్గెట్‌తో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కైరా అద్వానీ నటించారు. మహేష్‌బాబు సీఎంగా నటించిన ఈ చిత్రంపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. తన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్న సహాయక సిబ్బందికి మహేష్‌ ఎప్పుడు బహుమానాలు అందజేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నాడు.