పొరపాటున రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోకండి… ఎందుకంటే…

Don't accidentally sleep with your phone charging all night because...
Don't accidentally sleep with your phone charging all night because...

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోతున్నారు.ఎక్కువ మంది పొద్దున్న నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునేంత వరకు ఫోన్లోనే గడుపుతున్నారు. దీంతో రాత్రంతా ఛార్జింగ్ పెట్టి..చాలా మంది దాని పక్కనే నిద్రిస్తుంటారు . ఛార్జింగ్ విషయంలో ఈ పొరపాట్లు చేయకండని ఆయా కంపెనీలు పదే పదే చెప్పినా దాన్ని చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టి.. దాని పక్కనే నిద్రపోవడం వల్ల ఫోన్ బ్యాటరీ దెబ్బతినడమే కాదు.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పలు కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో ప్రముఖ కంపెనీ యాపిల్ దీని గురించి ఓ సంచలన ప్రకటన చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఐఫోన్ తయారీదారులు రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టడంపై పలు సూచనలు చేశారు. ఈ ప్రకటనలో US దిగ్గజం ఛార్జింగ్ కేబుల్‌కు కనెక్ట్ చేసిన డివైజ్ పక్కన పడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రస్తావించారు.

యాపిల్ కంపెనీ ఏం చెప్పింది?

ఐఫోన్ తయారీదారుల నివేదిక ప్రకారం, అగ్ని ప్రమాదం, ఛార్జింగ్ కేబుల్ పక్కన పడుకోవడం వల్ల విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, గాయం లేదా ఫోన్ డ్యామేజీ వంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఓపెన్ ప్రదేశాల్లో ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం వల్ల ప్రమాదాలను నివారించొచ్చు.

దుప్పట్ల కింద ఉంచొద్దు..

ఫుల్ ఛార్జింగ్ అయిన ఫోన్ దుప్పటి లేదా దిండు కింద ఉంచొద్దని ఐఫోన్ యూజర్లను హెచ్చరించింది. ఎందుకంటే ఛార్జింగులో ఉన్నప్పుడు ఫోన్ చాలా వేడిగా ఉంటుంది.

నాణ్యత లేని ఛార్జర్లను వాడొద్దు..

పవర్ అడాప్టర్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్, వైర్ లెస్ ఛార్జర్లు ఛార్జింగ్ అవుతున్నప్పుడు వాటిని దుప్పట్లు లేదా దిండ్ల కింద ఉంచొద్దని యాపిల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా మీ ఫోన్‌‌కు యూజర్లు థర్డ్ పార్టీ ఛార్జర్లకు దూరంగా ఉండాలని, ఇతర ఛార్జర్లను ఉపయోగించడం వంటివి కూడా చేయకండని యాపిల్ కంపెనీ తెలిపింది.నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని, తక్కువ క్వాలిటీ ఛార్జర్లు చౌకైన ఉత్పత్తులను మీకు సిఫార్సు చేయబడిన ఐఫోన్లకు వాడకండని,అంతర్జాతీయ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండే ఛార్జర్లను మాత్రమే వాడాలి.

పవర్ అడాప్టర్..

ఓ అసొసియేషన్ ప్రకారం, USB 2.0 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే పవర్ అడాప్టర్లు, కేబుల్స్‌తోనే ఐఫోన్లకు ఛార్జింగ్ పెట్టాలి. అయితే అది కూడా తప్పనిసరిగా భద్రతా నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే తడిగా ఉండే చోట ఫోన్లను ఛార్జ్ చేయొద్దు. డ్యామేజీ అయిన ఛార్జర్లను, తడిచిపోయిన డివైజెస్‌తో ఛార్జర్లను అస్సలు వాడకండి.