సైరా కోసం మిల్కీబ్యూటీ..!

tamanna in sye raa movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు ఇంకా పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒక కీలకమైన యువరాణి పాత్రలో తమన్నాను నటింపజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తమన్నా యువ రాణి పాత్రకు చక్కగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

‘బాహుబలి’ చిత్రంలో అవంతిక పాత్రలో నటించి ఆ పాత్రకే వన్నె తెచ్చిన ముద్దుగుమ్మ తమన్నాను ఈ చిత్రంలో యువ రాణి పాత్రకు ఎంపిక చేయాలని నిర్ణయించారు. చిరంజీవి సైతం గతంలో తన సినిమాలో అవకాశం ఇస్తాను అంటూ తమన్నాకు హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాడు. తమన్నా గత కొంత కాలంగా పెద్దగా ఆఫర్లు లేకుండా కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. తెలుగు మరియు తమిళంలో అడపా దడపా చిత్రాలు చేస్తూ ఉన్న తమన్నాకు ఇది అతి పెద్ద ఆఫర్‌గా చెప్పుకోవచ్చు. తమన్నా కెరీర్‌ నీరసంగా సాగుతున్న సమయంలో ఇలాంటి ఆఫర్‌ రావడం నిజంగా గొప్ప విషయం. సైరాలో తమన్నా నటించనుందా అనే విషయంపై క్లారిటీ రావాలి అంటే చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించాల్సి ఉంది.