కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్

కారు ప్రమాదం తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్

ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

క్రికెటర్ ఢిల్లీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా హమ్మద్‌పూర్ ఝల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం పంత్ నుదుటిపైన, కాలికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ దేహత్ స్వప్న కిషోర్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రస్తుతం రిషబ్ పరిస్థితి నిలకడగా ఉందని, అతన్ని రూర్కీ నుంచి ఢిల్లీకి రిఫర్ చేస్తున్నట్లు సక్షం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుశీల్ నగర్ తెలిపారు.

ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌ను ఢీకొని మంటలు అంటుకున్నాయి.

అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు.

అదే సమయంలో, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్‌ను ఢిల్లీ రోడ్డులోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు.