VD హీరోయిన్ తో నాని రొమాన్స్…!

Ritu Varma To Romance Nani

విజయ్ దేవరకొండ, రితువర్మ హీరో హీరోయిన్స్ గా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రుపొందినా చిత్రం పెళ్లి చూపులు. ఆ చిత్రంతో విజయ్ కి మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రంలో రితు వర్మ నటనకు మంచి మార్క్స్ పడ్డాయి. కానీ తెలుగు సినిమాలో అవకాశాలు మాత్రం రాలేదు. నిఖిల్ తో కేశవా చిత్రంలో నటించినా ఆ చిత్రం పరాజయంపాలు కావడంతో చెన్నైకి మకాం మార్చింది ఈ అమ్మడు. ప్రస్తతం అక్కడ సినిమాలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.

reethu-varma

నాని హీరోగా విక్రం కె కుమార్ దర్శకత్వంలో దర్శకత్వంలో సస్పెన్సు థ్రిల్లర్ గా ఓ చిత్రం త్వరలో తెరకెక్కనున్నది ఆ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంలో నాని సరసన కథానాయకను రితువర్మను ఎంపిక చేసింది మైత్రి మూవీ మేకర్స్. మరోసారి రితుకు తెలుగులో అవకాశం దక్కిన్చుకుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నది. రీతు కు నాని అయినా అదృష్టాన్ని తెచ్చి పెడతాడేమో చూడాలి. ప్రస్తుతం నాని జెర్సీ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నాని క్రికెట్ ప్లేయర్ గా కనిపిస్తాడు. 2019 ఏప్రిల్ లో ప్రేక్షకులముందుకు వస్తుంది.