చరణ్ ఓటు వెయ్యలేక పోయాడు…!

Feeling Disappointed For Unable Cast My Vote Ram Charan Posts

తాజాగా తెలంగాణ ఎలక్షన్స్ ఓటింగ్ లో రాం చరణ్ పాలు పంచుకోలేక పోయాడు. అయితే తనవంతు బాధ్యతగా తనదైనా స్టైల్ లో ఓటింగ్ పై స్పందించాడు. వోట్ మన అందరి బాద్యత ప్రతి ఒక్కరు తమ వోట్ హక్కును వినియోగించుకోవాలి. మంచి నాయకుడుని ఎన్నుకునే బాధ్యత మీ ఓట్ పైన ఆధారపడి ఉంటుంది అన్నారు. నేను ఈ సారి తెలంగాణా ఎలక్షన్స్ లో వోట్ హక్కును వినియోగించుకోలేకపోతున్నందుకు చాలా నిరుత్సాహంగా ఉంది.

ram charan

ప్రస్తుతం కొన్ని అనివార్యకారణాల వలన ఓట్ హక్కును వినియోగించుకోవడం లేదు అన్ని చాలా నిరాశతో ఉన్నాను అన్నారు.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 19 నుండి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం చరణ్ వినయ విధేయ రామ చిత్రానికి సంబందించిన ఓ సాంగ్ బ్యాలన్స్ ఉంటె ఆ సాంగ్ షూట్ చేసే పనిలో ఉన్నారు. ఆ సాంగ్ తో సినిమా పూర్తీ అవ్వుతుంది. ఆ చిత్రాని బోయపాటి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుంది.