రోబో 2.0 అప్డేట్ : ట్రైలర్ రిలీజ్ ఈరోజే

Trailer Set To Release On Today

రజినీకాంత్ అభిమానులే కాకుండా, దేశవ్యాప్తంగా సినీఅభిమానులు వేచిచూస్తున్న రోజు వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.0 సినిమా ట్రైలర్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కాబోతుంది. 550 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్లో ముప్పావు వంతు భాగం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేశారని వినికిడి.

Shankar Robo 2 Movie Budget 550 Crores

రజినీకాంత్, అమీ జాక్సన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ రోబో సీక్వెల్ చిత్రంలో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. కథ దృష్ట్యా ఈ సినిమాలో అతని పాత్ర విలన్ మాదిరి కాకుండా, ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న విపరీత పరిస్థితులకు వ్యతిరేకంగా నెగిటివ్ పంథాలో పోరాటం చేసే పాత్రని, అతని చర్యలను ఎదుర్కొనే పాత్రలో చిట్టి రోబో మరింత పవర్ఫుల్ గా కనిపిస్తాడని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయినా టీజర్లో చిట్టి పోరాటాలను మచ్చుకగా చూపించారు.చెన్నై లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతుంది.