చంద్రబాబు ఫై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఫై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు ఫై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత కాదు, పనికిమాలిన నేత అని విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ది రాలేదని రోజా అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు విశేష ప్రజాధారణ చూసి ఓర్వలేక ప్రజా చైతన్య యాత్ర పేరుతో సిగ్గు లేకుండా తిరుగుతున్నారని దారుణ వ్యాఖ్యలు చేసారుల్. అయితే జగన్ ప్రకటించిన మూడు రాజధానులు చంద్రబాబు వ్యతిరేకత తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రజా చైతన్య యాత్ర పేరుతో తిరుగుతున్న చంద్రబాబు ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో తిరగనివ్వకపోగా తరిమి తరిమి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే ప్రస్తుతం జగన్ పాలన లో చంద్రబాబు మినహా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, గత ఎన్నికల్లో 23 సీట్లొచ్చిన టీడీపీ కి వచ్చే ఎన్నికల్లో అవి కూడా రావని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కొద్దీ రోజుల్లోనే దాదాపు 80 శాతం హామీలు నెరవేర్చారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం లో మెనూ బావుందన్న రోజా, అమ్మ వోడి పథకం కూడా చాలా బాగా పనిచేస్తుందని అన్నారు.