డుమ్మా కొడుతున్న హెబ్బా పటేల్

డుమ్మా కొడుతున్న హెబ్బా పటేల్

నితిన్, రష్మిక హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న భీష్మ చిత్రంలో నటి హెబ్బా పటేల్ కూడా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పలు కార్యక్రమాలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు, ప్రమోషన్స్ కు హెబ్బా డుమ్మా కొడుతోంది. కుమారి 21 ఎఫ్ చిత్రం తో ప్రేక్షకుల మతి పోగొట్టిన హెబ్బా పటేల్ ఈ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కు దగ్గర పడుతుండటంతో నితిన్, రష్మిక జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే ఈ భీష్మ చిత్ర యూనిట్ హెబ్బా కు ముందుగానే ప్రమోషన్స్ లో పాల్గొనాలి అంటూ చెప్పినప్పటికీ వాటినేమి పట్టించుకోవడం లేదు ఈ హీరోయిన్. బుధ్వె హెబ్బా పటేల్ వెళ్లకుండా ఉండటానికి గల కారణం, ఆ చిత్రంలో చాల చిన్న పాత్రలో కనిపించడం, కానీ ఒక విధంగా ఆలోచిస్తే హెబ్బా పటేల్ కు చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు. అసలే కష్టాల్లో ఉన్న హెబ్బా ఇలా చేయడం ఒక విధంగా తన కెరీర్ కి మైనస్ అని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.