గురువారం ఢిల్లీ వెళ్లనున్న పవన్

గురువారం ఢిల్లీ వెళ్లనున్న పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి ఢిల్లీకి పయనమయ్యారు. గురువారం ఢిల్లీ వెళ్లనున్న పవన్, అక్కడ కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. మిలిటరీ డే సందర్భంగా పవన్ అమరవీరుల సంక్షేమ కుటుంబాలకు ఇటీవల కోటి విరాళం ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కేంద్రీయ బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్న పవన్ అక్కడ సైనికాధికారులు కోటి చెక్ ని అందజేయనున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ అక్కడే గురువారం మధ్యాహ్నం ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్స్ సదస్సులో పాల్గొనున్నారు. అయితే పవన్ ఈ సదస్సులో దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. అక్కడి విద్యార్థులతో పవన్ మాట్లాడనున్నారు, వారి సందేహాలకు పవన్ సమాధానాలు ఇస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఫై షార్ట్ ఫిలిం ఒకటి అక్కడ ప్రదర్శించనున్నారు.