“అవును” సినిమాని కాపీ చేసిన “ది ఇన్విసబుల్ మేన్”

మాములుగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే “కాపీ” అనే పదం తరచూ వినిపిస్తూనే ఉంటుంది.దానిని ఇప్పుడు “ప్రేరణ” అని మార్చేసి ట్రెండ్ లోకి తీసుకొచ్చారు.ఎంతసేపు మన సినిమాలను మనమే తక్కువ చేసుకొనే సరికే మన వాళ్ళకి సమయం సరిపోదు.కానీ మన దగ్గర తీసిన లాంటి సినిమాలు అందులోని పలు సీన్లను మక్కికి మక్కీ దింపేసిన హాలీవుడ్ సినిమాలు కూడా కొన్ని ఉండే ఉండొచ్చు ఏమో మనకు తెలీదు అంతే.

అయితే ఇప్పుడు అలాంటి ఒక హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూసిన చూసిన తర్వాత మన తెలుగులో ఇలాంటి సినిమాయే ఒకటి ఉందే…అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.లెయ్ వానెల్ తెరకెక్కించిన “ది ఇన్విసబుల్ మేన్” ట్రైలర్ ఇటీవలే బయటకు వచ్చింది.ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ “యూనివర్సల్ పిక్చర్స్” వారు నిర్మించారు.అయితే ఈ ట్రైలర్ ను చూసినట్లయితే మన తెలుగులో విలక్షణ మరియు మోస్ట్ అండర్ రేటెడ్ దర్శకుడు అయినటువంటి రవిబాబు తెరకెక్కించిన హార్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ “అవును” సినిమా గుర్తొస్తుంది.

“ది ఇన్విసబుల్ మేన్” స్టోరీ లైన్ కూడా దీని లాగానే అనిపిస్తుంది.పూర్ణ పాత్రలానే ఒక మహిళ కనిపించకుండా మనుషులను చంపే ఓ మనిషి అంతే కాకుండా చాలా షాట్లు కూడా “అవును” సినిమాలానే ఉన్నాయి.అయితే ఈ కాన్సెప్ట్ కూడా రవిబాబుకి తట్టిన ఆలోచనేనా అంటే అది కూడా చెప్పలేం ఎందుకంటే గతంలో ఇదే హాలీవుడ్ లో “ది హాలో మేన్” లైన్ లా అనిపిస్తుంది.అయితే అవును సినిమా మనిషి కనిపించడు అనేది జస్ట్ లైన్ మాత్రమే అయితే..

ఈ ఇన్వెసబుల్ మేన్ మాత్రం పూర్తిగా అవును కి కాపీలా అనిపిస్తుంది.మన వాళ్ళు వాళ్ళ సినిమాల స్టోరీలను ఎలా లేపేస్తున్నారో వాళ్ళు అలాగే చేస్తున్నారేమో కానీ ఇలాగే మరో చిత్రం కూడా ఉంది.యాక్షన్ చిత్రాలలో మోస్ట్ ఫేమస్ సిరీస్ లలో ఒకటి అయిన “ఇప్ మేన్ 3” సినిమా చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వం వహించిన “జానీ” సినిమాను తలపిస్తుంది.ఇది పక్కన పెడితే ఓ సారి “అవును” మరియు “ది ఇన్విసబుల్ మేన్” ట్రైలర్లు చూసెయ్యండి.