రాష్ట్ర పోలీసులపై తీవ్రమైన హెచ్చరికలు చేసిన చంద్రబాబు నాయుడు

రాష్ట్ర పోలీసులపై తీవ్రమైన హెచ్చరికలు చేసిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు ప్రజాచైతన్య యాత్ర చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా చంద్రబాబు చేస్తున్న ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఒంగోలుకి చేరుకొని, అక్కడ మాట్లాడుతూ… రాష్ట్ర పోలీసులపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తు, పలు హెచ్చరికలు చేశారు. కాగా ఈ మేరకు మాట్లాడిన చంద్రబాబు… పిచ్చి తుగ్లక్ సీఎం జగన్ చెప్పినట్లు వినొద్దని, తప్పు చేస్తే మాత్రం ప్రజా కోర్టులో పోలీసులను శిక్షిస్తామని, అసలే వదిలిపెట్టేది లేదని చంద్రబాబు నాయుడు పోలీసులను హెచ్చరించారు. అంతేకాకుండా సీఎం జగన్ పై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇకపోతే రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నామనే గర్వతో సీఎం జగన్ తన ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని, అంత ధైర్యమే ఉంటె రాజధానిని అమరావతి నుండి మారుస్తామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణం కోసమని స్థానిక రైతులందరూ తమ భూములను ఇచ్చేశారని, అలాంటి రైతులను సీఎం జగన్ చాలా దారుణంగా మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చిహ్సారు.