వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రమైన ఆగ్రహం

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రమైన ఆగ్రహం

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ, అధికార పార్టీ నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో నేడు ప్రజా చైతన్య యాత్ర ను ప్రారంభించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… అయితే చంద్రబాబు చేపట్టిన ఈ యాత్ర వెనకాల పెద్ద స్కీమ్ ఉందని అధికార వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు సంచలనమైన వాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు పాదయాత్రను ఎవరు అడ్డుకోలేదని, ఈ ప్రజా చైతన్య పేరుతొ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెడుతూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇకపోతే రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఐటి దాడులనుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు యాత్ర చేపట్టారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. అంతేకాకుండా ఈ ఐటీ దాడులనుండి, మీడియాకి దొరక్కుండా తప్పించుకొని తిరిగేందుకు చంద్రబాబు బూటకపు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఇకపోతే యాత్రలో భాగంగా చంద్రబాబు అధికార పార్టీ నేతల తోకలు కత్తిరిస్తానని వాఖ్యానించారని, కానీ ఎవరి తోకలు ఎవరు కత్తరించారో అందరికి తెలుసనీ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.