సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్

సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్

ప్రస్తుతానికి రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొక వైపు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కాగా ఇప్పటికే హిందీలో విజయవంతమైన పింక్ చిత్రాన్ని తెలుగులో పవన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ సినిమా కూడా చేయనున్నారు పవన్ కళ్యాణ్… కాగా ఈ చిత్రానికి “వీరూపాక్షి” అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబందించిన రోజుకొక వార్త చిత్ర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

అయితే ఇంతలోనే మరొక వార్త బయటకొచ్చింది. కాగా వీరి కలయికలో రానున్నటువంటి పెరియాడికల్ చిత్రంలో అలనాటి కాలానికి సంబందించిన అన్ని అంశాలను మేళవించేందుకు దర్శకుడు క్రిష్ ప్రయత్నిస్తున్నారు. కాగా తాజాగా దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ ఓ బిగ్ బోట్ సెటప్ వేయనున్నాడని సమాచారం. దీనిలో ప్రత్యేకంగా ఒక ఫైట్ సీన్ ని తీయనున్నారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి ప్రయత్నిస్తున్నారు దర్శకనిర్మాతలు…