Rolex కోసం రోలెక్స్ గిఫ్ట్…. సూర్యకు కమల్..

కమల్ హాసన్ తాజాగా సూర్యకు తాను పోషించిన రోలెక్స్ పాత్రకు తగ్గట్టుగా రోలెక్స్ వాచ్‌ని గిఫ్ట్ ఇచ్చాడు…సూర్య చేతికి ఉన్న ఈ వాచ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది ఏ మోడల్, ధర ఎంత అయి ఉంటుందని అందరూ వెతుకుతున్నారు.

ఇది Rolex Day-Date 40 Rose Gold President మోడల్ అని తెలుస్తోంది. దీని ధర సుమారు 62 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి సూర్యకు మాత్రం ఇలా తన ప్రేమను వ్యక్త పరిచాడు కమల్ హాసన్. విక్రమ్ సినిమా కోసం అయితే సూర్య రెమ్యూనరేషన్ తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ కమల్ హాసన్ మాత్రం ఇలా బహుమతి రూపేణా సూర్యకు చిరకాలం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చేశాడు.