‘రూల్స్ రంజన్‌’ ట్రైలర్‌ రిలీజ్.. కిరణ్ అబ్బవరం బాగా నవ్వించాడుగా

‘రూల్స్ రంజన్‌’ ట్రైలర్‌ రిలీజ్.. కిరణ్ అబ్బవరం బాగా నవ్వించాడుగా
Latest News

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. సరైన హిట్ లేకపోయినా డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటూ తెలుగు తెరపై సందడి చేస్తున్నాడు. కెరీర్ కాస్త గాడి తప్పబోతున్న సమయంలో వినరో భాగ్యము విష్ణు కథా మూవీ తో ఫాంలోకి వచ్చాడు. తాజాగా ఈ యంగ్ హీరో రూల్స్‌ రంజన్‌ అనే మూవీ తో త్వరలో థియేటర్ల ముందు సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాలో సమ్మోహనుడా పాట ఇప్పటికే నెట్టింట హల్​చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

‘రూల్స్ రంజన్‌’ ట్రైలర్‌ రిలీజ్.. కిరణ్ అబ్బవరం బాగా  నవ్వించాడుగా
Rules Ranjan

తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్​గా సాగింది. కిరణ్​ ఎప్పుడు చూడని అవతార్​లో.. పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్​తో ఈ ట్రైలర్​లో అదరగొట్టాడు. సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాను రత్నం కృష్ణ తెరకెక్కించారు. ఇందులో కిరణ్ సరసన డీజే టిల్లు ఫేం నేహా శెట్టి కూడా నటిస్తోంది. ఈ ట్రైలర్​లో వన్‌ లైనర్ డైలాగ్స్ అయితే వేరే లెవల్లో ఉన్నాయి.