ఖుష్బుకు తీవ్ర అనారోగ్యం…!

Kushboo to be hospitalised for surgery

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తమిళం మరియు తెలుగులో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి నిన్నటి తరం హీరోయిన్స్‌లో స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న ఖుష్బు ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో పెద్ద హీరోల సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న ఈమె తమిళంలో మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ ఉంది. బుల్లి తెరపై వెండి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని, ఈవయస్సులో కూడా చాలా బిజీగా కెరీర్‌లో దూసుకు పోతున్న ఖుష్బూ గురించి గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఒక పుకారు తెగ చక్కర్లు కొట్టింది.

 Kushboo to be hospitalised for surgery

ఖుష్బుకు తీవ్ర అనారోగ్యం అని, చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో వారం రోజులుగా ఆమె చికిత్స తీసుకుంటున్నారు, ఆమె పరిస్థితి విషయమంగా ఉంది అంటూ వైధ్యులు చెబుతున్నారు అనేది మీడియాలో వస్తున్న పుకారు. ఆ పుకార్లపై ఎట్టకేలకు ఖుష్బు స్పందించింది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయని, తాను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను అని, రోజుకు పది గంటలు షూటింగ్‌లో పాల్గొనేంత ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల వ్యక్తిగత కారణంగా హాస్పిటల్‌కు వెళ్లాను. అప్పటి నుండి మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెలబ్రెటీలు అన్నప్పుడు హాస్పిటల్‌కు వెళ్తే తీవ్ర అనారోగ్య పరిస్థితులు అంటూ రాసేస్తారా అంటూ ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలో పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాతో ఖుష్బు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.