‘సాహో’ షాకింగ్‌ పుకార్లు

Rumours Comments On Social Media In Sahoo Movie Release

ప్రభాస్‌ హీరోగా ‘బాహుబలి’ చిత్రం తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం దాదాపు 250 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్‌కు దాదాపు రెండు నెలలుగా బ్రేక్‌ పడటం జరిగింది. షూటింగ్‌ బ్రేక్‌కు కారణం ఏంటీ అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దుబాయి షెడ్యూల్‌ పూర్తి అయిన వెంటనే సినిమా షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు కూడా షూటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో పలువురు పలు రకాలుగా అనుకుంటున్నారు.

Sahoo movie

‘సాహో’ చిత్రం షూటింగ్‌ ఆగడానికి కారణం స్క్రిప్ట్‌లో మార్పులు అనేది బలంగా వినిపిస్తున్న కారణం. సాహో చిత్రం స్క్రిప్ట్‌ ఇప్పటికే పలు సార్లు మార్చారు. దర్శకుడు సుజీత్‌కు అంతగా అనుభవం లేని కారణంగా పదే పదే స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్‌ కూడా పరిధి దాటి పోతున్న నేపథ్యంలో నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. షూటింగ్‌ విషయంలో ప్రభాస్‌కు క్లారిటీ లేకుండా ఉందని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈ సమయంలోనే రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని ప్రభాస్‌ చేసేందుకు సిద్దం అయ్యాడు. సాహో చిత్రం పూర్తి అయితే తప్ప ఆ చిత్రాన్ని మొదలు పెట్టడం కష్టంగా ఉంది. సాహో చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఆవిషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే సంవత్సరం వస్తుందో లేదంటే 2020 వరకు ఆగాల్సి వస్తుందో అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.