సాహోకి అక్కడే వసూళ్లు ఎక్కువగా వచ్చాయి

సాహోకి అక్కడే వసూళ్లు ఎక్కువగా వచ్చాయి

మరోసారి దేశం మొత్తం తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసిన చిత్రం ఏదన్నా ఉంది అంటే అది సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “సాహో” చిత్రమే అని చెప్పాలి.భారీ అంచనాలు నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది కానీ సినిమా పరంగా మాత్రం అంత తీసి పారేయ్యాల్సిన చిత్రం కాదు.

అలాగే ఈ చిత్రాన్ని మన దగ్గర కన్నా హిందీలో ఎక్కువగా వీక్షించారు.దీనితో అక్కడే వసూళ్లు ఎక్కువగా వచ్చాయి.దీనితో ఈ సినిమా హిందీ వెర్షన్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.అయితే ఈ చిత్రానికి సంబందించి మాత్రం ఇప్పటికీ ఒక సస్పెన్స్ అలా కొనసాగుతూనే వస్తుంది.ఈ చిత్రం హిందీ స్ట్రీమింగ్ వెర్షన్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని.అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారన్న సంగతి అందరికి తెలుసు.

అలాగే ఒక్క హిందీ భాషలో తప్ప మిగతా అన్ని భాషల్లోనూ అది స్ట్రీమ్ అవుతుంది.దీనితో నెటిజన్స్ హిందీ వెర్షన్ ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు.అయినా వారి నుంచి సరైన సమాధానం లేదు.అలాగే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం సాహో హిందీ వెర్షన్ హక్కులను మరో స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ “నెట్ ఫ్లిక్స్” సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇంకా వారు ఎప్పుడు ప్రసారం చేస్తారు అన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు కానీ హిందీ వెర్షన్ హక్కులను అయితే అమెజాన్ ప్రైమ్ వారు తీసుకోకపోవడం వల్లే వారు తమ ఫాలోవర్స్ కు సరైన సమాచారం ఇవ్వలేదని దీనికి కారణం నెట్ ఫ్లిక్స్ వారే అని తెలుస్తుంది.మరి వీరైనా ఏదన్నా చెప్తే బాగుండు.